హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త శిల్పను పోలీసులు అరెస్ట్ చేశారు. శిల్ప సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్సర్ ల దగ్గర్నుంచి డబ్బులు తీసుకొని మోసాలకు పాల్పడుతోంది. ముగ్గురు టాలీవుడ్ హీరోలను మోసం శిల్ప మోసం చేసినట్టు సమాచారం.
ప్రముఖుల పేర్లు చెప్పి ఆమె డబ్బులను వసూలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఫేజ్ త్రీ పార్టీ లు ఇచ్చి ఆమె సెలబ్రిటీలను ఆకర్షిస్తున్నారు. 100 నుండి 200 కోట్ల రూపాయల వరకు కుచ్చు శిల్పా కుచ్చుటోపి పెట్టినట్టు సమాచారం.
శిల్ప బారిన పడిన వారిలో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ,లాయర్లు ఫైనాన్సు సైతం ఉన్నారు. ఆధిక వడ్డి ఇస్తానని చెప్పి నింధితురాలు కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. శిల్ప తో పాటు ఆమె భర్తను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.