నగరాలు పట్టణాలు కాస్మోపాలిటన్ మెట్రోపాలిటన్ సిటీలు ఇలా తేడా ఏమీ లేదు గుట్టుగా వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు కొందరు. ఎవరికి అనుమానం రాకుండా ఫ్యామిలీలా కలరింగ్ ఇస్తారు ఇళ్లు అద్దెకు తీసుకుని వీరి దందా షురూ చేస్తారు. రోజూ చాలా మంది పురుషులు వస్తూ వెళ్లడంతో అనుమానం వచ్చి స్ధానికులు పోలీసులకి చెబితే వీరి బండారం బయటపడుతున్న ఘటనలు ఎన్నో చూశాం.
తాజాగా గుట్టుగా సాగుతున్న వ్యభిచారాన్ని రట్టు చేశారు అయినవిల్లి పోలీసులు. ఇక్కడ ఇద్దరు అమ్మాయిలతో సహ ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని అయినవిల్లిలో ఓ ముఠా గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తోంది. తొత్తరమూడి జైభీమ్ నగర్లోని భార్య, భర్త ఇద్దరూ కలిసి ఇక్కడకు అమ్మాయిలని తీసుకువస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా ఇలా ఇంట్లోనే అమ్మాయిలని ఉంచి వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
వ్యభిచారంపై సమాచారం అందుకున్న అయినవిల్లి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఇద్దరు యువతులు, ఒక విటుడితో పాటువ్యభిచార గృహం నిర్వహిస్తున్న భార్యా, భర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు