Flash- సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

Secunderabad Gandhi Hospital fire

0
82

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీనితో ఒక్కసారిగా రోగులు ఆందోళనకు గురయ్యారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో రోగులు పరుగులు తీశారు. మొదటి అంతస్తులో విద్యుత్ ప్యానెల్ బోర్డు షార్ట్ సర్క్యూట్ కారణంగా 6 ఫ్లోర్ లలో ఉన్న ప్యానెల్ బోర్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

అప్రమత్తమైన గాంధీ సిబ్బంది రోగులను బయటకు వెళ్లాల్సిందిగా సూచించడంతో లేబర్ డిపార్ట్మెంట్ లో బాలింతలు పసి పిల్లల్ని ఎత్తుకొని బయటకు పరుగులు తీశారు. కొందరు వీల్ చైర్ లో రాగా మరికొందరు పసిగుడ్డులను ఎత్తుకొని పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ ద్వారా మంటలు చెలరేగిన ప్యానెల్ బోర్డులో మంటలను ఆర్పారు. గాంధీ సూపర్డెంట్ రాజారామ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ఈ ప్రమాదం సంభవించలేదని రోగుల అంతా సురక్షితంగా ఉన్నారని ఫైర్ అధికారి తెలిపారు.