ఈ పాము చూడండి ఎంత పెద్ద గుడ్డు మింగేసిందో – వీడియో

See how big the egg this snake swallowed

0
96

పాముని చూస్తే ఎవరైనా భయపడతారు. అక్కడ పాము ఉంది అంటే ఆమడ దూరం పారిపోతారు . అయితే కొందరు పాములని పట్టుకుని అడవిలో వదిలిపెడతారు. మరికొందరు పాము కనిపించగానే అక్కడ నుంచి జారుకుంటారు. పిల్లలు పెద్దలు అందరూ ఈ పాముల విషయంలో ఎంతో భయపడతారు.ఇక పాములు తన ఆకలిని తీర్చుకునేందుకు రకరకాల కీటకాలు, చిన్న చిన్న పక్షులను సైతం తింటుంటాయి.

కొన్ని పాములు అయితే తమ కంటే పెద్దవాటిని కూడా తినాలి అని ప్రయత్నం చేస్తాయి. పాములు గుడ్లను కూడా తింటుంటాయి. పెద్ద సైజులో ఉండే గుడ్లను పాము నిజంగానే తింటుందా అంటే ఒక్కోసారి ఇలాంటి వీడియోలు కూడా మనం చూశాం.

ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ వీడియోలో మీరు ఆ పాముని చూడవచ్చు. ఆకలితో ఉన్న పాము తన కంటే పెద్దగా ఉన్న గుడ్డుని మింగేసింది. ఆకలి కోసం ఏమైనా చేస్తారు అనడానికి ఇది ఉదాహరణ అని చాలా మంది అంటున్నారు.

https://twitter.com/i/status/1400399362019188743