జింకను ఈ చిరుత ఎలా వేటాడిందో చూడండి – వీడియో వైరల్

See how this leopard hunted the deer

0
83

మనం సోషల్ మీడియాలో కొన్ని రకాల వీడియోలు చూస్తూ ఉంటాం తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అయితే జంతువులు పక్షులకి సంబంధించిన వీడియోలు కూడా తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఇక అడవిలో అవి వేటాడే వీడియోలు కూడా మనం చూస్తు ఉంటాం. ఇవన్నీ చూసి చాలా మంది షాక్ అవుతారు. ఎందుకంటే అడవిలో వాటి వేట ఎలా ఉంటుందో మనం ప్రత్యక్షంగా చూడలేము అందుకే కొందరు వీటిని తమ కెమెరాల్లో బంధిస్తారు.

చిరుత పులులు సింహాలు వేటాడే సమయంలో ఎంతలా పరుగు పెడతాయో తెలిసిందే. వేటిపైన అయినా అవి టార్గెట్
పెట్టాయి అంటే ఇక అవి చిక్కవలసిందే. రెప్పపాటులో అవి ఏ జంతువునైనా తమ ఎరగా చేసుకుంటాయి.
ఇక్కడ ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. సరస్సు దగ్గర కొన్ని జింకలు నీరు తాగుతుండగా అకస్మాత్తుగా ఓ చిరుత మెరుపు దాడి చేస్తుంది.

అవి బెదిరిపోతూ అటూ ఇటూ పరుగు పెడుతూ ఉంటాయి . కానీ ఓ జింక మాత్రం ఆ చిరుతకి ఆహారం అవుతుంది. చివరకు చిరుత నుంచి తప్పించుకోలేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

https://twitter.com/i/status/1433754536812949510