Senior citizen murdered by women with help of her four boy friends: టీ దుకాణం నిర్వహిస్తున్న వితంతువుకు.. అక్కడకు వచ్చే నలుగురు వృద్ధులకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా.. వివాహేతర సంబంధంలా మారింది. నలుగురుతోనూ ఆ మహిళ ఏకకాలంలో శృంగార కార్యకలాపాలు సాగించేది. మరొక వృద్ధుడు సైతం సదరు మహిళ పట్ల ఆకర్షితుడు కావటం.. అతనితో సైతం ఆమె వివాహేతర సంబంధం పెట్టుకోవటం జరిగింది. అంతవరకూ బాగానే సాగినా.. మెుదటి నలుగురికి ఇది రుచించలేదు. దీంతో ఆ వృద్ధుడిని నలుగురు వృద్ధులు, మహిళ కలిసి హత్య చేసి మృతదేహాన్ని మరుగదొడ్డి ట్యాంక్‌లో పడేశారు.
ఈ దారుణ ఘటన బీహార్‌లోని నలందాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిను దేవీ (30) అనే వింతంతువు నలందాలో టీ దుకాణం నిర్వహిస్తోంది. అక్కడ టీ తాగటానికి కృష్ణనందన్ ప్రసాద్ (75), సూర్యమణి కుమార్ (60), వాసుదేవ్ పాశ్వాన్ (63), లోహా సింగ్ (62) అనే వృద్ధులు తరుచుగా రావటంతో, పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఏకకాలంలోనే నలుగిరితో శృంగార కార్యకలాపాలు సాగించేవారు. కొన్నాళ్ల తరువాత ఆ దుకాణానికి తృపిత్ శర్మ (75) అనే మరో వృద్ధుడు వచ్చాడు. తృపిత్ శర్మతో సైతం పిను దేవి వివాహేతర సంబంధం పెట్టుకుంది.
మెుదట్లో ఈ విషయం మిగిలిన నలుగురికి తెలియకుండా జాగ్రత్త పడింది పిను దేవీ. కానీ తృపిత్ శర్మతో పిను దేవీకి మధ్య ఉన్న సాన్నిహత్యం నలుగురికి అనుమానం వచ్చేలా చేసింది. దీంతో పినుదేవిని మిగిలిన నలుగురు నిలదీయగా, వారిద్దరి మధ్య ఉన్న ఎఫైర్ గురించి బయటపెట్టింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నలుగురూ, తృపిత్ శర్మతో బంధాన్ని తెంచుకొని, అతడికి దూరంగా ఉండాలనీ.. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని వారు హెచ్చరించారు. భయపడిన పిను దేవి.. తృపిత్ శర్మను తన దుకాణానికి రావొద్దని ఎన్నిసార్లు చెప్పినా అతడు అంగీకరించలేదు.
తృపిత్ ఎంత చెప్పినా వినకపోవటంతో.. అతడిని చంపేందుకు ఆ నలుగురు ప్రియులతో కలిసి.. పిను దేవి ప్లాన్ చేసింది. పథకం ప్రకారం తృపిత్‌ను ఇంటికి పిలవగా.. అక్కడే మాటు వేసి ఉన్ మిగిలిన నలుగురు వృద్ధులు అతడిపై రాళ్లతో మూకుమ్మడి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన తృపిత్ అక్కడికక్కడే మృతి చెందాడు.(Senior citizen murdered) అనంతరం ఐదుగురు కలిసి తృపిత్ మృతదేహాన్ని సమీపంలో ఉన్న మరుగుదొడ్డి ట్యాంక్‌లో పడేశారు.
అక్టోబర్ 28న హత్య జరిగింది. అయితే తృపిత్ కనిపించటం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయటంతో.. రంగంలోకి దిగిన పోలీసులకు దర్యాప్తు చేపట్టారు. తీగ లాగితో డొంక అంతా కదిలినట్లు.. పిను దేవీ వద్దకు రెగ్యులర్‌గా టీ తాగేందుకు వెళ్లేవాడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో పిను దేవిని కొన్ని రోజులు ఫాల్ కాగా, ఆమె ప్రవర్తనలో తేడా ఉండటంతో.. అదుపులోకి తీసుకొని, విచారించటంతో.. ఈ ఉందంతం బయటకు వచ్చింది. దీంతో పిను దేవి సహా.. నలుగురు ప్రియులను పోలీసులు అరెస్టు చేశారు.