Flash: ఘోర రోడ్డు ప్రమాదం..7 మంది సైనికులు మృతి..పలువురికి గాయాలు

0
127

జమ్మూ&కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా లద్దాఖ్​లో   జరిగిన ప్రమాదంలో భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వస్తుంది.  26 మంది సైనికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి శ్యోక్​ నది సమీపంలో లోయలో పడడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.

ఈ ప్రమాదంలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన సైనికులకు మెరుగైన వైద్యం కోసం ఎయిర్​ అంబులెన్స్​లో తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.