ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..22 మందికి గాయాలు

0
80

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని నందిగామ మండలం పెద్ద తామరపల్లి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ఉన్నట్లు తెలుస్తుంది. కాగా బస్సు కల్వర్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీనితో 22 మంది తీవ్రంగా గాయపడగా..నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.