హైదరాబాద్‌లో గంజాయి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని ఎస్సార్ నగర్, అమీర్‌పేట్‌లో టాస్క్ ఫోర్స్ పోలీసులు మత్తుమందును విక్రయిస్తున్న గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు అమీర్‌పేట, ఎస్సార్ నగర్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకున్నారు.
నిందితుల నుంచి సుమారు 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒక మహిళ, ఆరుగురు పురుషులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదుచేసి ఎస్పార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.