విషాదం..పుణ్యస్నానానికి వెళ్ళి ఏడుగురు యువకులు మృతి..

0
88

హిమాచల్​ప్రదేశ్​లోని ఉనా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఏడుగురు యువకులు కోల్కా గ్రామంలోని గోవింద్ సాగర్ సరస్సులో మునిగి మరణించారు. వివరాల్లోకి వెలితే..పంజాబ్​కు చెందిన ఏడుగురు యువకులు హిమాచల్​ప్రదేశ్ టూర్​కు వెళ్లారు.

అక్కడ ఉనా జిల్లాలోని నైనా దేవి ఆలయాన్ని సందర్శించాలనుకుని కోనేరులో పుణ్యస్నానం  చేయాలనుకున్నారు. ముందుగా సరస్సులోకి ఏడుగురు యువకుల్లో ఒక యువకుడు దిగాడు. అతడు నీటిలో కాస్త ముందుకెళ్లగానే.. అతడు మునిగిపోయాడు. వెంటనే కాపాడడానికి ఆరుగురు ముందుకెళ్లారు. దురదృష్టవశాత్తు అందరూ ఆ సరస్సులో మునిగిపోయారు.