అయోధ్యకు వెళ్తుండగా ప్రమాదం..ఏడుగురు స్పాట్ డెడ్

0
109

ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో  భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వచ్చింది.  కర్నాటక నుంచి 16 మందితో బస్సు అయోధ్య వెళ్తున్న సమయంలో ఆదివారం ఉదయం టూరిస్ట్‌ బస్సును ట్రక్కు ఢికొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 16 మంది ఉండగా..7 మంది అక్కడిక్కడే మృతిచెందినట్టు తెలిపారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడడంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని హుటాహుటిగా ఆసుపత్రికి తరలించారు. ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్‌ఘటన స్థలం నుండి పరారవవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.