తెలిసిన వ్యక్తి ద్వారా ఆమె అప్పు తీసుకోవడం తప్పు అయింది. అదే ఆమె జీవితాన్ని నాశనం చేసింది.
పుణేలో ఓ మహిళ తనకు పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా మరో వ్యక్తి నుంచి లక్ష రూపాయలు అప్పు తీసుకుంది. అయితే అతను వడ్డీ డబ్బుల కోసం నెల నెల ఇంటికి వచ్చేవాడు ఆమె కొన్ని రోజులు బాగానే ఇచ్చింది అతను నెల నెలా తీసుకున్నాడు.
ఆమె అందంగా ఉండటంతో ఆమెని వడ్డీ డబ్బులు వద్దు పడక సుఖం ఇవ్వాలి అని కోరాడు. ఆమె దానికి నిరాకరించింది ఇక భర్తకు ఈ విషయం చెప్పలేదు. ఓరోజు ఆమెని గన్ తో బెదిరించాడు చివరకు ఆమెపై లైంగిక దాడి చేశాడు. తన కోరిక తీర్చకపోతే భర్త, పిల్లలను చంపేస్తానని బెదిరించి ఆమెని లొంగతీసుకున్నాడు.
బాధితురాలని తనతో పాటు ఆరు నెలలపాటు ఐదారు నగరాలకు తిప్పాడు . ఢిల్లీ, మవాల్, పఠాన్ కోట్, సూరత్ ఇలాంటి నగరాలకు తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇవన్నీ వీడియోలు తీసి తాను కోరిన సమయంలో కోరిక తార్చాలి లేకపోతే ఇవి సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తా అని బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు అతని గురించి ఫిర్యాదు చేసింది.