విచారణలో కన్నీరుపెట్టిన షారుఖ్ పుత్రరత్నం..ఎందుకో తెలుసా?

0
128

డ్ర‌గ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ను ఎన్సీబీ విచారించింది. ఈ విచార‌ణ స‌మ‌యంలో ఆర్య‌న్ ఖాన్ క‌న్నీరు ఆపుకోలేపోయాడ‌ని, ఏడుస్తూనే గ‌డిపాడ‌ని అధికారులు చెప్పారు. అత‌డు నాలుగేళ్లుగా డ్ర‌గ్స్ తీసుకుంటున్న‌ట్లు తేలింద‌ని వివ‌రించారు.

ఆర్య‌న్ విదేశాల్లో ఉన్న‌ప్పుడు కూడా డ్ర‌గ్స్ తీసుకుంటూనే ఉండేవాడ‌ని తెలిపారు. కాగా, నిన్న ఆర్య‌న్‌, అర్బాన్‌, మున్మున్‌ల‌ను మెట్రోపాలిట‌న్ మెజిస్ట్రేట్ ముందు హాజ‌రుప‌రిచారు. ప్ర‌స్తుతం వారు ఎన్సీబీ క‌స్ట‌డీలో ఉన్నారు. ఆర్య‌న్ పై ప‌లు సెక్షన్ల కింద కేసులు న‌మోదు చేశారు. ఈ కేసులో ఐదుగురిని నేడు కోర్టులో హాజ‌రుప‌రచ‌నున్నారు.

ఈ కేసుకు సంబంధించి మ‌రిన్ని కీల‌క విష‌యాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే త‌న కొడుకును బెయిల్‌పై విడుద‌ల చేయించ‌డానికి షారుఖ్ ఓ ప్రముఖ క్రిమినల్ లాయ‌ర్ ద్వారా ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నాడు. త‌న షూటింగ్ కార్య‌క్ర‌మాల‌ను కూడా షారుఖ్ వాయిదా వేసుకున్న‌ట్లు తెలుస్తోంది.