బంధువులు కొట్టడంతో భర్త చనిపోయాడని చెప్పింది – కానీ అసలు నిజం బయటపడింది

She said her husband died after being beaten by relatives-But the real truth survived

0
89

కొందరు మహిళలు అక్రమ సంబంధాలు పెట్టుకుని క్షణిక సుఖం కోసం దారుణంగా భర్తలని చంపుతున్న ఘటనలు ఇటీవ‌ల చూస్తున్నాం .అయితే ఇక్కడ కూడా తాజాగా ఇలాంటి ఘటన జరిగింది.
ఛ‌త్తీస్ ఘ‌డ్ లోని సనావల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బంధువులు కొట్టడంతో తన భర్త చనిపోయాడని పోలీసులకి భార్య చెప్పింది. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను చనిపోవడంతో అందరూ ఇది నిజం అనుకున్నారు.

కానీ పోలీసులు విచారణ చేస్తే అసలు విషయాలు బయటకు వచ్చాయి. పోస్టుమార్టమ్ రిపోర్ట్ లో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడి భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. దీంతో ఇరు కుటుంబాలు కలిసి మాట్లాడుకున్నాయి. ఈ స‌మ‌యంలో గొడవ జరిగింది. కాని ఈ విషయాన్ని భర్త పెద్దగా పట్టించుకోలేదు.

బంధువులపై తిరగబడ్డాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది గాయాలు అయ్యాయి. ఆ త‌ర్వాత అతడికి మద్యం తాగించింది. అతడి మెడకు తాడు బిగించి ఊపిరి ఆడకుండా చేసింది. వెంట‌నే బంధువులు కొట్టార‌ని ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అక్క‌డ చికిత్స పొందుతూ చ‌నిపోయాడు. అతను ఆ దెబ్బలకు చనిపోయాడు అనుకున్నారు అంద‌రూ. కాని పోస్ట్ మార్టమ్ రిపోర్టులో మెడకు తాడు బిగించి ఊపిరి ఆడకుండా చంపారు అని తేలింది. భర్తను చంపిన కిలాడీ లేడీ ఇలా పోలీసులకు దొరికిపోయింది. చివరకు జైలుకు వెళ్లింది.