వివాహం అయి 7 నెలలు – బావతో గంటలకొద్ది భార్య ఫోన్ – చివరకు భర్త దారుణం

ఆమె గురించి తెలుసుకుంటే పెళ్లికి ముందు నుంచి వీరికి అఫైర్ ఉంది అని తెలిసింది

0
79

చెన్నైలోని నిత్యానంద భువనేశ్వరికి వివాహం అయి ఏడు నెలల అయింది. అయితే వివాహం అయిన తర్వాత నుంచి భువనేశ్వరి ఎక్కువగా ఫోన్లు మాట్లాడుతోంది. భర్త ఎవరితో ఇంత సేపు అంటే మా కుటుంబ సభ్యులతో అని చెప్పేది. అతను డ్రైవింగ్ పనిమీద బయటకు వెళ్లేవాడు. ఇలా అవసరంతో ఆమెకి ఫోన్ చేసినా ఫోన్ బిజీ అని వచ్చేది. ఓ సారి ఎవరు ఇంత సేపు అని నిలదీస్తే. మా బావతోనే సరదాగా మాట్లాడుతున్నా అని చెప్పింది.

ఇక భర్త కూడా పెద్ద పట్టించుకోలేదు. కాని తర్వాత అతనికి అనుమానం పెరిగింది. ఆమె గురించి తెలుసుకుంటే పెళ్లికి ముందు నుంచి వీరికి అఫైర్ ఉంది అని తెలిసింది..భువనేశ్వరి ఆమె బావ సెల్వాతో ఎక్కువగా ఫోన్ మాట్లాడటం అతనికి నచ్చేది కాదు. చాలా సార్లు మారాలి అని చెప్పాడు, ఫ్యామిలీ వారే కదా తప్పేంటి అని భర్తతో గొడవ పడేది.

కరోనా వైరస్ టైమ్ లో, లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో కూడా పదేపదే పుట్టింటికి వెళ్లి వస్తానని భువనేశ్వరి వెళ్లేది. ఈ సమయంలో బావని కలిసేది అని తెలిసింది. ఇక కోపంతో రగిలిపోయి ఆమెని కత్తితో నరికి చంపేశాడు భర్త. తర్వాత నేరుగా పోలీసుల దగ్గరకు వెళ్లి లోంగిపోయాడు.