ఆనందంగా సాగిపోతోంది వారి జీవితం కాని ఒక మాట వారి కుటుంబాన్ని చివరకు విషాదంలో నెట్టింది. తమిళనాడులోని చెన్నైలో ఈ జంట ఓ బేకరి నడుపుతున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఇక భార్య భర్త కూడా చాలా ఆనందంగా ఉంటారు. అయితే రోజూ మధ్నాహ్నం భార్య వచ్చి బేకరిలో కూర్చుంటుంది . ఇక భర్త ఆ సమయంలో ఏదైనా పని ఉంటే బయటకు వెళతాడు లేదంటే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాడు.
ఆ సమయంలో తన భార్య బేకరీకి వచ్చి పనులు చూసుకునేది. అంతా బాగానే ఉంది కాని మొన్న మాత్రం ఇలా నన్ను రోజూ బేకరీలో కూర్చోపెట్టి నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు అని ప్రశ్నించింది. ఇది కాస్తా భార్యభర్తల మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఈ క్రమంలోనే ఆగ్రహించిన భర్త ఆమె ముఖం తలపై దాడి చేశాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది.
బంధువులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమెకు గాయాలు అయినట్టుగా గుర్తించిన వైద్యులు చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె మరణించింది. చిన్న మాటకి చివరకు ఇరువురి మధ్య గొడవ జరిగి విషాదం నెలకొంది. స్ధానికులు అందరూ ఆమె మరణంతో కన్నీరు మున్నీరు అయ్యారు.