శిల్పా శెట్టి భర్తపై అరిచేసింది కన్నీటి పర్యంతం – విచారణ అధికారులు ఏమంటున్నారంటే

Shilpa shetty fire on her husband Rajkundra

0
106

పోర్నోగ్రఫీ కేసుకు సంబంధించి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోలీస్ కస్టడీలో ఉన్నారు. అయితే తాజాగా విచారణ నిమిత్తం శిల్పా శెట్టి ఇంటికి వెళ్లగా ఆమె కన్నీటి పర్యంతమైంది. ఆమె పెద్దగా ఏడ్చేసిందని అధికారులు తాజాగా చెప్పారు. ఇక భర్త రాజ్ కుంద్రాపై ఆమె ఆగ్రహంగా ఉన్నారట. ఈ హాట్ షాట్స్ తో తనకు సంబంధం లేదని ఆమె తెలిపారు.

పోర్నోగ్రఫీ వ్యవహారం మొత్తం కుటుంబాన్ని ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టిందని రాజ్ కుంద్రాపై ఆమె మండిపడిందని అన్నారు విచారణ అధికారులు . ఈ కేసు వల్ల చాలా ఎండార్స్ మెంట్లు వెనక్కి వెళ్లిపోయాయి, అంతేకాదు పలు సంస్ధలు వీటిని రద్దు చేసుకున్నాయని చెప్పారట. ఇక విచారణ సమయంలో తనకే పాపమూ తెలియదంటూ శిల్పకు రాజ్ కుంద్రా చెప్పాడని అధికారులు వివరించారు.

అయితే అసలు అవి పోర్న్ చిత్రాలు కాదని శృంగార చిత్రాలు మాత్రమేనని వివరించే ప్రయత్నం చేశాడట. అయితే ఈ కేసుకి సంబంధించి శిల్పా శెట్టికి ఎలాంటి సంబంధమూ లేదని ఇక ఆమెని విచారించబోమని తెలిపారు అధికారులు.