భారత్ అమ్ములపొదిలో శివుని త్రిశూలం..చైనాకు ఇక చెక్..!

Shiva's trident in Indian ammulapodi..check to China ..!

0
82

చైనాకు షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చేందుకు భారత బలగాలు సిద్ధమయ్యాయి. గల్వాన్‌ ఘర్షణలో భారత సైన్యంపై ఇనుప రాడ్ల తరహా ఆయుధాలతో..డ్రాగన్‌ మూకలు దాడికి తెగబడ్డాయి. అప్పుడు చైనా బలగాల దాడిని సమర్థంగా తిప్పికొట్టిన భారత బలగాలు..ఇప్పుడు నూతన ఆయుధాలను సమకూర్చుకున్నాయి. సరిహద్దుల్లో కాల్పులు జరిపే ఆయుధాలు వినియోగించకూడదని ఇరు దేశాల మధ్య ఒప్పందం ఉంది. ఈ నేపథ్యంలో ప్రాణ హాని లేని నూతన ఆయుధాలు తయారయ్యాయి.

శివుడి చేతిలోని త్రిశూలం ఇప్పుడు భారత బలగాల చేతిలో ఆయుధంగా మారింది. కొత్తగా రూపొందించిన గ్లౌజులు తొడుక్కొని ఒక్క పంచ్‌ ఇస్తే..చైనా సైనికుడు మూర్చపోవాల్సిందే. నయా లాఠీలు తాకితే చాలు.. డ్రాగన్‌ బలగాలు కిందపడి గిలగిలా కొట్టుకోవాల్సిందే.

గల్వాన్‌ ఘర్షణలో చైనీయులు తమ సంప్రదాయ ఆయుధాలను వాడారని.. అందుకే తాము కూడా భారత సంప్రదాయాన్ని చాటుతూ త్రిశూలాన్ని తయారు చేశామని అపాస్టెరాన్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మోహిత్ కుమార్ వెల్లడించారు.

గత ఏడాది గల్వాన్‌లో భారత్‌-చైనా మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో చైనా బలగాలు భారత సైనికులపైకి ఇనుప రాడ్లు, టేజర్‌లను ప్రయోగించారు. దీనికి జవాబు ఇచ్చేందుకు భారత భద్రతా దళాలు ప్రాణహాని లేని ఆయుధాలు తయారు చేసే ప్రాజెక్టును మాకు అప్పగించాయి. భారత భద్రతా బలగాలకు ఈ ఆయుధాలను అందించడం ప్రారంభించాం. వారి నుంచి చాలా మంచి స్పందన వస్తోంది.