వీడు డ్రగ్స్ ఎలా సరఫరా చేస్తున్నాడో తెలిసి షాకైన అధికారులు- అచ్చం సినిమాలోలా

Shocked officials know how drugs are being supplied

0
100

ఈ డ్రగ్స్ సరఫరా గురించి చాలా సార్లు సినిమాల్లో చూసి ఉంటారు. కొందరు ముఠాగా ఏర్పడి పోలీసులకి విమానాశ్రయంలో సెక్యూరిటీకి దొరకకుండా డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉంటారు. సూర్య నటించిన వీడొక్కడే సినిమాలోలా ఓ వ్యక్తి పొట్టలో డ్రగ్స్ దాచుకొని వచ్చి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. అచ్చం సినిమా స్టైల్ లో ఈ వ్యక్తి పొట్టలో డ్రగ్స్ తో వచ్చాడు.

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో తూర్పు ఆఫ్రికాలోని మొజాంబిక్ దేశానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం పట్టుబడ్డాడు. అతని దగ్గర నుంచి రూ.10 కోట్ల విలువ చేసే 1.02 కేజీల కొకైన్ ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇతను పొట్టలో ఈ డ్రగ్స్ పెట్టుకుని కుట్లు వేసుకుని వచ్చాడు. అయితే సిబ్బందికి అనుమానం వచ్చి చెక్ చేస్తే కడుపులో కొకైన్ క్యాప్సుల్స్ కనిపించాయి.

70 క్యాప్సూళ్లను నిందితుడు మింగినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని బైకుల్లాలోని జేజే ఆసుపత్రికి తరలించి కొకైన్ క్యాప్సూళ్లను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. కచ్చితంగా ఇలాంటి పని ఎవరు చేసినా వదిలిపెట్టమని అణువణువూ గాలిస్తామంటున్నారు అధికారులు.