Shraddha murder case men with swords attack delhi police van carrying accused aaftab poonawala in delhi: తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఆఫ్తాబ్ అమిన్ పునావాలకు దిల్లీలోని రోహిణిలో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. అయితే గతంలోనే ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉన్నా, నిందితుడి ఆరోగ్య సమస్యల కారణంగా అప్పుడు ఈ పరీక్షను నిర్వహించలేదు. ప్రస్తుతం పాలీగ్రాఫ్ పరీక్ష పూర్తి కావటంతో, నార్కో ఎనాలసిస్ పరీక్షను కూడా త్వరలోనే నిర్వహించనున్నారు. కాగా, ఫోరెన్సిక్ పరీక్షల అనంతరం ఆఫ్తాబ్‌ను ల్యాబ్ నుంచి జైలుకు తరలిస్తుండగా, కొందరు పోలీస్ వ్యాన్‌పై దాడికి తెగబడ్డారు. వ్యాన్ తలుపులు తెరిచి.. ఆఫ్తాబ్‌పై దాడికి యత్నించారు. పోలీసులు అప్రమత్తమై, ఆందోళనకారులను అరెస్టు చేశారు. శ్రద్దాకు న్యాయం చేయాలంటూ సుమారు 15 మంది నినాదాలు చేస్తూ.. ఆఫ్తాబ్ (Aftab) ఉన్న వ్యాన్‌పై కత్తులతో దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
దిల్లీలో తనతో సహజీవనం చేస్తున్న శ్రద్దా వాల్కర్‌ని.. ఆఫ్తాబ్ అతి కిరాతకంగా హత్య చేశాడు శ్రద్ధా శరీరాన్ని 35 ముక్కలుగా నరికి.. ఫ్రిజ్ దాచి, శరీర భాగాలను వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు. ఘటన జరిగిన ఆరు నెలల తరువాత ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. శ్రద్ధ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో, రంగంలోకి దీగిన పోలీసుల (Shraddha murder case)దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. శ్రద్ధా శరీర భాగాలు ఫ్రిజ్‌లో ఉండగానే, ఆ గదిలోకి మరొక యువతితో ఆఫ్తాబ్ సన్నిహితంగా గడిపినట్లు సమాచారం. అంతేగాకుండా అదే ఫ్రిజ్‌లో ఆహారపదార్థాలను నిల్వ చేసి.. తినేవాడని పోలీసుల విచారణలో తేలింది.
శ్రద్ధా మృతదేహాన్ని ముక్కలు చేసేందుకు ఉపయోగించినట్లుగా భావిస్తున్న ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రద్ధాకు చెందిన ఉంగరాన్ని ఆఫ్తాబ్ మరో ప్రియురాలికి బహూకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్య అనంతరం అనుమానం రాకుండా, శ్రద్ధా ఫోనుతో ఆమె మిత్రులతో నిందితుడు ఛాటింగ్ చేసేందుకు ఉపయోగించేవాడనీ, అంతేగాకుండా ఆమెకు చెందిన క్రెడిట్ కార్డులను వాడటం, వాటి బిల్లులను చెల్లించటం చేసేవాడని పోలీసులు తెలిపారు
#WATCH | Police van carrying Shradhha murder accused Aftab Poonawalla attacked by at least 2 men carrying swords who claim to be from Hindu Sena, outside FSL office in Delhi pic.twitter.com/Bpx4WCvqXs
— ANI (@ANI) November 28, 2022