Flash: ములుగు జిల్లాలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఎస్ఐ ఆత్మహత్య..

0
90

తెలంగాణలోని ములుగు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సీఆర్పీఎఫ్ ఎస్సై జెడ్ ఎల్ ఠాక్రే గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వాజేడు గ్రామంలో చోటు చేసుకుంది. ఈయన  మహారాష్ట్ర లో పుట్టి కొంతకాలం జీవనం సాగించగా..ఉద్యోగం రావడంతో వాజేడు పోలీస్ స్టేషన్ క్యాంప్ లోని CRPF 39 బెటాలియన్ ‘C’- కంపెనీలో ఎస్సైగా పని చేస్తున్నాడు.

ఈయన వ్యక్తిగత కారణాల వలన ఈ ఆత్మహత్యకు పాల్పడినట్టు అతని స్నేహితులు, సన్నిహితులు చెబుతున్నారు. నేడు ఉదయం 9  గంటల సమయంలో క్యాంప్ లోని తన రూమ్ లో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం తెలుస్తుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఏటూర్ నాగారానికి తరలించారు పోలీసులు.