లైంగిక ఆరోపణల కేసులో కొమురంభీం జిల్లా రెబ్బెన ఎస్సై భవాని సేన్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
అసలేం జరిగిందంటే..
కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ కావడానికి ఓ యువతి ఎస్ఐ భవానీ సేన్ ను ఆశ్రయించింది. తనకు స్థోమత లేదని, మెటీరియల్ ఉంటే ఇచ్చి సాయం చేయాలని అడిగింది. దీనిని అలుసుగా తీసుకున్న ఎస్సై యువతీ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. స్టేషన్ కి వస్తే బుక్స్ ఇస్తానని పిలిచి లైంగిక వేధింపులకు దిగాడు. దీనితో యువతీ ఎస్సైపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.