Flash- సింగం నటుడు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు..!

0
90

డ్రగ్స్‌ వినియోగిస్తూ సింగం నటుడు డ్యానీ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సూర్య హీరోగా నటించిన సింగం-2 సినిమాలో నటించిన నైజీరియన్ ​దేశస్థుడు, నటుడు చాక్‌‌‌విమ్​ మాల్విన్‌‌‌ (డ్యానీ) గుర్తున్నాడు కదా. ఆ సినిమాలో అక్రమంగా డ్రగ్స్ సప్లై చేసే ముఠాకు సంబంధించిన వాడిగా నటించాడు మాల్విన్‌. సీన్‌ కట్‌ చేస్తే నిజ జీవితంలో కూడా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడం ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయింది.

నిందితుడి నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 15 లక్షల వరకు ఉంటుందని సమాచారం. కరోనా లాక్‌డౌన్ సమయంలో సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో మెల్విన్ డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్టు పోలీసులు పేర్కొన్నారు.

అయితే మెల్విన్‌తో సినీ పరిశ్రమకు చెందిన ఎవరితో అయినా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాగా కన్నడ, తమిళ, హిందీ భాషల్లో మెల్విన్‌ పలు చిత్రాల్లో నటించాడు.