వామ్మో ఇదేంటి – అత్తగారికి బాయ్ ఫ్రెండ్ కావాలి ప్రకటన ఇచ్చిన కోడలు

sister-in-law given advertainment for Mother-in-law wants a boyfriend-

0
113

ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు పెద్ద వారు అవుతారు. పెళ్లి చేసుకుని వారి లైఫ్ లో బిజీ అవుతారు. ఇక వారి పిల్లలు వారి సంసారం ఉద్యోగం వ్యాపారాలతో బిజీగా ఉంటారు. అయితే కొందరు భర్తలు దూరం అవడంతో ఒంటరిగా కూడా ఉంటారు. అలాంటి వారు ఎక్కడకు వెళ్లలేకపోతారు. ఇక రెండో పెళ్లి కూడా చేసుకోలేక అలా ఒంటరిగా ఉండిపోతారు. కాని కొందరు పిల్లలు మాత్రం వారికి మళ్లీ పెళ్లి చేస్తారు.

ఇప్పుడు ఓ వింత ప్రకటన జారీ చేసింది ఓ కొత్త కోడలు. ఏమిటంటే అమెరికాలో ఈ కోడలు తన అత్తగారికి బాయ్ ఫ్రెండ్ కావాలి అని ప్రకటన ఇచ్చింది. 40 నుంచి 60 ఏళ్ల మధ్యనున్న ఓ బాయ్ ఫ్రెండ్ను వెతుకుతోందట. అయితే ఇది కేవలం రెండు రోజులకి మాత్రమే. ఓ స్నేహితురాలి పెళ్లికి వెళ్లబోతున్నామని, అక్కడ అత్తగారు ఒంటరిగా ఫీలవ్వకుండా రెండు రోజుల పాటు ఓ బాయ్ ఫ్రెండ్ను ఆమెకు తోడుగా తీసుకెళ్లాలనుకుంటున్నట్లు కోడలు తెలిపింది.

ఇక ఆ వ్యక్తికి దాదాపు 70,000 ఇస్తామని తెలిపింది. న్యూయార్క్లోని హడ్సన్ వ్యాలీకి చెందిన ఈ కోడలు ప్రకటన ఇచ్చింది. ఇక అత్తగారి వయసు 51 ఏళ్లు. బాగా నవ్వించాలి, డాన్స్ రావాలి, నవ్వుతూ ఉండాలి ఇవి కండిషన్లు. కొందరు అప్లై చేసుకున్నారట. మరి చూడాలి ఈ కోడలు ఎవరిని సెలక్ట్ చేస్తుందో.