breaking: ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు స్పాట్ డెడ్..పదిమంది పరిస్థితి విషమం

0
78

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డియోరియాలో గౌరీబాజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా వచ్చి బులెరో బస్సును ఢీకొనడంతో..ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. 10మందికి పైగా తీవ్ర గాయాలు కావడంతో సమీప ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు బులెరో ప్రయాణికులు, ఒకరు బస్సు ప్రయాణికుడు మరణించినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కు తరలించారు. అంతేకాకండా చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాధ్ సంతాపం వ్యక్తం చేసి..వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.