నాలుగేళ్లుగా పాముకి పాలు పోసి పెంచాడు – చివరకు దారుణం జరిగింది

0
119

పాములతో చాల జాగ్రత్తగా ఉండాలి ఎంత మనం వాటిని పాలు పోసి పెంచినా, ఏదో ఓ రోజు అవి మనల్ని కాటు వేస్తాయని వాటిని నమ్మక్కర్లేదు అని నిపుణులు చెబుతారు. అంతేనా ఓ కొండచిలువ ఏకంగా తన యజమానిని తినడానికి నాలుగు రోజులు ఆహారం కూడా తీసుకోలేదు. ఈ ఘటన కూడా విన్నాం. ఇక్కడ ఓ విషాదకర ఘటన జరిగింది. పాములకు పాలు పోసిన వ్యక్తే చివరకు పాము కాటుకు గురై ప్రాణాలు విడిచాడు.

నాలుగేళ్లుగా జూలో పనిచేస్తూ పాముల ఆలనా పాలనా చూసుంటున్న వ్యక్తే, కోబ్రా కాటుకు గురై మరణించాడు. తిరువనంతపురం జంతుప్రదర్శనశాలలో విషపూరిత కోబ్రా కాటువేయడంతో జూ కీపర్ ఎ.ఎస్.హర్షద్ మరణించాడు. అతని మరణంతో జూ సిబ్బందితో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు.

హర్షద్ నాలుగేళ్లుగా తిరువనంతపురం జూలో పనిచేస్తున్నాడు. చేరిన దగ్గర నుంచి పాముల సంరక్షణ బాధ్యతను అధికారులు అప్పగించారు. మధ్యాహ్నం 12గంటల సమయంలో కోబ్రాలు ఉండే ప్రదేశం ఎన్క్లోజర్ను శుభ్రం చేస్తుండగా, కోబ్రా పాము హర్షద్ చేతిపై కాటు వేసింది. ఆస్పత్రికి తీసుకువెళ్లినా ఈలోపే అతను ప్రాణాలు కోల్పోయాడు.