పాములు పట్టే వ్యక్తి పాముకాటుతోనే మృతి..

0
113

అతను పాములు పట్టడంలో మహామేధావి. అతను ఎన్నో పాములను పట్టి  ప్రజలను కాపాడేందుకు వాటిని దూరంగా అడవిలో వదిలేసేవాడు. కానీ ఆ వ్యక్తే పాము కాటుతో మరణించాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితి సింగారంలో చోటు చేసుకుంది.

అతని పేరు పట్టె షరీఫ్. ఈ రోజు మధ్యాహ్నం సమితి సింగారంలోని ఓ బావిలో త్రాచు పామును పట్టిన షరీఫ్..పాముతో ఆటలు ఆడుచుండగా పాము కాటుకు గురయ్యాడు. అతని స్నేహితులు హాస్పిటల్ కు వెళ్ళమని చెప్పిన త్రాగిన మైకంలో వాళ్ళ మాట వినిపించుకోలేదు. అతను గంటసేపటి వరకు పామును ఆడించి..అడవిలో వదిలేసి వస్తుండగా ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయి మరణించాడు.