Shocking Video : వామ్మో 10 గుడ్లు మింగేసిన తాచుపాము – ఈ వీడియో చూడండి

Snake swallowed 10 eggs - Shocking video

0
156

ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా జంతువులకి సంబంధించి అనేక వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక అడవిలో జంతువుల మధ్య ఫైట్ తప్పించుకున్న వీడియోలు చూస్తున్నాం. అలాగే ఈ మధ్య పెళ్లి సమయంలో జరుగుతున్న సరదా సన్నివేశాలు వీడియోల్లో చూస్తున్నాం.

తాజాగా మహారాష్ట్ర నుంచి ఇలాంటి వీడియోనే వెలుగులోకి వచ్చింది. ఓ త్రాచుపాము పది గుడ్లను మింగింది చాలా ఇబ్బంది పడింది. చివరకు ఈ పాము ఆ పది గుడ్లని బయటకు వదిలేసింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ ప్రాంతానికి చెందిన వీడియో ఇది. కోశాంబి గ్రామంలో నివసిస్తున్న పవన్ లోన్బుల్ నివాసంలోకి త్రాచుపాము రాత్రి వేళ వచ్చింది. అది కోడి దగ్గరకు వెళ్లి అక్కడ గుడ్లు మింగేసింది.

ఆ పాము తర్వాత ఇబ్బంది పడి బుసలు కొట్టింది. ఇంట్లో వారు ఆ శబ్దం విని బయటకు వచ్చారు. వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చారు. ఇక ఆ పాము ఒక్కో గుడ్డు బయటకు కక్కింది.ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇలా పాములు గుడ్లు మింగుతాయా అని ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు.