మేనల్లుడని ఇంటికి రానిస్తే ఏకంగా అత్తతో అఫైర్ చివరకు ఏం చేశాడంటే

Son-in-law affair with aunty

0
133

ఈ రోజుల్లో మంచి చేసినా చెడు ఎదురు అవుతోంది. దగ్గర వాడు మనవాడు బంధువే కదా అనుకుంటే మన కొంపకే ఎసరు పెడుతున్నారు. ఏకంగా జీవితాలనే నాశనం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు వింటూ ఉంటే మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి అనేది పక్కాగా అర్దం అవుతుంది. సొంత మేనల్లుడే కదా అని ఇంటికి రానిస్తే మేనమామ భార్య మీదే కన్నేశాడు ఓ ప్రబద్ధుడు. అంతేకాదు అత్తను తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నాడు.

బీహార్ లోని జముయి జిల్లాకి చెందిన ఓ వ్యక్తి కొత్తగా పెళ్లి చేసుకుని భార్యతో ముంబైలో కాపురం పెట్టాడు. అదే నగరంలో ఆటో నడుపుతున్న అతడి మేనల్లుడు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఇక భర్త కూడా ఏమీ అనేవాడు కాదు. ఇక కుర్రాడు అత్తతో సరదాగా మాటలు కలిపాడు. చివరకు ఇద్దరి మధ్య అఫైర్ నడిచింది. భర్తకు తెలియకుండా ఇద్దరూ సీక్రెట్ గా ఇంట్లో రొమాన్స్ చేసేవారు.

మేనమామ ఇంట్లో లేని సమయంలో అతడు ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఇలాంటివి ఎక్కువ రోజులు దాగవు కదా ఓ రోజు ఆమె భర్త బెడ్ రూమ్ లో ఇద్దరిని చూశాడు. చివాట్లు పెట్టాడు ఇక మేనళ్లుడు ఇంటికి రాకుండా ఆపాడు. అత్తా మేనల్లుడు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. ఇలా ఓరోజు ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో మేనల్లుడు ఆమెను ఎత్తుకెళ్లిపోయాడు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.