వాయువ్య బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రాంతం పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తర ఒడిశాలోని తీర ప్రాంతాలలో ఉంది. అనుబంధ ఉపరితల ఆవర్తనం మధ్య-ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించి ఎత్తుతో నైరుతి దిశగా ఉందని విశాఖపట్నం వాతావరణం కేంద్రం తెలిపింది.
రాగల 48 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా, జార్ఖండ్ మరియు ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా కదిలే అవకాశం ఉంటుదని, నైరుతి ఋతుపవనాలు వాయువ్య బంగాళాఖాతం యొక్క మిగిలిన భాగాలలో ఒడిశాలోని మరికొన్ని భాగాలు, పశ్చిమ బెంగాల్ యొక్క చాలా భాగాలు మరియు జార్ఖండ్ మరియు బీహార్ యొక్క కొన్ని భాగాలలోకి మరింత విస్తరించాయి.
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం లో ఈరోజు ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం పడే అవకాశం,కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని అదేవిధంగా దక్షిణ కోస్తా ఆంధ్ర ,రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే చాన్స్ ఉంటుందని విశాఖపట్నం వాతావరణం కేంద్రం తెలిపింది.