Breaking- బుల్​ఫైట్​లో కుప్పకూలిన స్టాండ్..ఆరుగురు మృతి

0
91

కొలంబియాలోని ఎస్పినాల్ నగరంలోని బుల్‌ఫైట్ స్టేడియంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎద్దుల పోటీలను తిలకించేందుకు మైదానంలో ఏర్పాటు చేసిన 3 అంతస్తుల స్టాండ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా..వందలాది మంది గాయాలపాలయ్యారు.  క్షతగాత్రుల్లో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.