నాగబాబు కూతురు నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ

0
117

ప్రముఖ సినీ నటుడు, చిరంజీవి తమ్ముడు నాగబాబు కుమార్తె నిహారిక ఇంట్లో బుధవారం అర్థరాత్రి గొడవ జరిగింది. హైదరాబాద్ లోని నిహారిక ఉండే అపార్ట్ మెంట్ లో ఆమె భర్తకు అపార్ట్ మెంట్ వాసులకు మధ్య గొడవ అయింది.

నిహారిక భర్త న్యూసెన్స్ చేస్తున్నాడంటూ అపార్ట్ మెంట్ వాసులు ఆరోపించారు. అయితే అపార్ట్ మెంట్ వాసులపై నిహారిక భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపార్ట్ మెంట్ వాసులు కూడా ఆమె భర్త మీద ఫిర్యాదు చేశారు.

పరస్పర ఫిర్యాదులు అందడంతో పోలీసులు వారిని పిలిచి విచారిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.