వింత గ్రామం – ఇక్కడ ఈలలతోనే మాట్లాడతారు

Strange village whistles are spoken here

0
75

మన దేశంలో కొన్ని గ్రామాల్లో చాలా వింత ఆచారాలు పాటిస్తారు. మరికొందరు కట్టుబాట్లు కూడా ఎక్కడా చూడని విధంగా ఉంటాయి. విభిన్న రకాల ప్రజలు జీవిస్తారు ఆహార శైలి, సంప్రదాయాలు అన్నీ వేర్వేరుగా ఉంటాయి. అయితే భాషతో మాట్లాడుకోవడమే కాదు ఈల ద్వారా కూడా మాట్లాడుకునే వారు ఉంటారు. అయితే సైగలతో మాట్లాడేవారిని చూశాం ఇప్పుడు ఈల ద్వారా మాట్లాడేవారి గురించి తెలుసుకుందాం.

ఈ గ్రామం ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఉంది. ఈ గ్రామం పేరు కాంగ్తాంగ్. కాని అందరూ విస్లింగ్ విలేజ్ అని పిలుస్తారు. ఖాసీ తెగకు చెందిన ఇక్కడ వారు సాధారణ భాషకు బదులుగా విజిల్ ని ఉపయోగిస్తున్నారు. ఇక్కడ మాములుగా వారి పేరెంట్స్ పెట్టిన పేరుతో పాటు విజిల్ తో మరో పేరు ఉంటుంది. ఇలా రెండు పేర్లు ఉంటాయి ఇక్కడ వారికి.

అయితే ఈ ఈల భాష ఎలా కనిపెట్టారు అంటే ఇక్కడ గ్రామానికి చెందిన వ్యక్తి
శత్రువులను తప్పించుకోవడానికి చెట్టు ఎక్కాడు. ఇలా ఈలతో తప్పించుకున్నాడు కాబట్టి అప్పటి నుంచి ఈ ఈల వాడుతున్నారు. ఇక్కడ 100 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ ట్యూన్ల ప్రకారం వారి పేర్లు ఉన్నాయి.