వరుడి కుటుంబం వింత కోరిక – క‌ట్నంగా 21 కాలి వేళ్లున్న తాబేలు – ఎందుకంటే

ఆ వరుడు కుటుంబం ఈ పెళ్లికి నో చెప్పింది

0
104

నిశ్చితార్దం జరిగింది ఈ సమయంలో అడిగినంత కట్నం ఇచ్చారు. అయినా అబ్బాయి కుటుంబానికి కోరిక ఆశ తీరలేదు. ఇక అమ్మాయికి స‌ర్కారు కొలువు కూడా వేయిస్తాం. ఇద్దరూ బాగా ఉద్యోగం చేసుకుంటారు అని చెప్పి మరో పది లక్షలు తీసుకున్నారు. అయినా వారికి ఆశ తీర‌లేదు.

పెళ్లి రోజుకి కట్నంగా 21 కాలి వేళ్లున్న తాబేలు, బ్లాక్ లాబ్రడార్ ని ఇవ్వాలని యువతి కుటుంబాన్ని ఆదేశించారు. అయితే ఇవి వారికి దొరకలేదు. ఇక ఆ వరుడు కుటుంబం ఈ పెళ్లికి నో చెప్పింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఈ ఘటన జరిగింది. వెంటనే వారు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు.

నాసిక్ కు చెందిన ఆర్మీ జవాన్ కు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఔరంగాబాద్ కు చెందిన ఒక యువ‌తితో నిశ్చితార్థం జరిగింది. రెండు లక్షల నగదు, పది గ్రాముల బంగారాన్ని కట్నంగా ఇచ్చారు. ఇక ఆమెకి సర్కారీ కొలువు ఇస్తామని చెప్పి పది లక్షలు అద‌నంగా వ‌రుడి కుటుంబం తీసుకున్నారు. ఇక ఆ తాబేలు డిమాండ్ చేయడంతో వారు ఎంతో ప్రయత్నించారు అయినా దొరకలేదు. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే ముందు ఇచ్చిన క‌ట్నం బంగారం ఇవ్వ‌మంటే వెన‌క్కి ఇవ్వ‌న‌న్నారు.
దీంతో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. వ‌రుడి కుటుంబం పై కేసు న‌మోదు చేశారు.