ఫ్లాష్: బాలుడి ప్రాణాలను పొట్టనపెట్టుకున్న వీధి కుక్కలు..

0
87

తెలంగాణాలో వీధి కుక్కలు చేసిన పని కారణంగా విషాదం చోటుచేసుకుంది. ఇంటి ముందు పాపం పుణ్యం తెలియని రెండేళ్ల బాలుడు ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధి కుక్కలన్ని దాడి చేయడంతో తీవ్ర గాయాలకు గురయ్యాడు. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యి రక్తమడుగులో ఉన్న ఆ బాలుడిని హుటాహుటిగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌ టోలిచౌకి సమతాకాలనీలో చోటుచేసుకుంది.