తిరుపతిలో కలకలం..విద్యార్థిని ఆత్మహత్య..ప్రేమ లేఖ‌లు, గిఫ్టులు స్వాధీనం

0
99

ఏపీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తిరుపతిలోని పద్మావతి ఇంటర్ కాలేజీలో చిత్తూరు జిల్లా కె.వి పల్లి మండలం గర్నిమిట్టకు చెందిన విష్ణు ప్రియ చదువుతుంది. అయితే విష్ణుప్రియ ప్రేమ వ్యవహారంలో కుటుంబ పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారని తీవ్ర మనస్థాపం చెందింది. దీనితో విష్ణుప్రియ హాస్టల్ లోని రెండో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె గదిలో ప్రేమ లేఖ‌లు, గిఫ్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.