ఇలా కూడా పగ తీర్చుకుంటారా..!

-

Chennai |పగలు ప్రతీకారాలు తీర్చుకోవడం అంటే అందరికీ భౌతిక దాడి లేదా సఫా చేసేయడమే తెలుసు. కానీ చెన్నైలోని ఓ యువకుడు మాత్రం తాను ప్రేమించిన వ్యక్తి తనను దూరం పెడుతుందన్న కోపంతో పగ తీర్చుకోవడానికి వింతైన వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏదైనా మితంగానే ఉంటే బాగుంటుందన్న విషయాన్ని కూడా నిరూపించాడు. అసలేమైందంటే..

- Advertisement -

చెన్నై(Chennai) శివార్లలోని పెరియామెట్‌లో ఓ మైనర్ బాలుడు(17) తన 22ఏళ్ల ట్యూషన్ టీచర్‌తో ప్రేమలో పడ్డాడు. తొలుత తనతో బాగానే మాట్లాడుతూ గడిపిన యువతి కొంతకాలంగా తనను దూరం పెడుతుండటాన్ని బాలుడు గమనించాడు. ఆ దూరాన్ని అతడు సహించలేకపోయాడు. ఎంతో తెలియక మదనపడిపోయాడు. తనను ఇంతటి మానసిక వ్యధకు గురిచేసిన ఆ యువతిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అందుకు ఆ బాలుడు ఆన్‌లైన్ సర్వీస్‌ను వినియోగించుకున్నాడు. ఆ యువతి చిరునామాకు వరుసగా క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు పెట్టడం ప్రారంభించాడు. దానికి తోడు ఓలా, ఉబేర్ వంటి క్యాబ్‌లను కూడా వరుస పెట్టి బుక్ చేయడం ప్రారంభించాడు. ఇలా 77 సార్లు ఆన్‌లైన్ ట్యాక్సీలను బుక్ చేశాడు. దాంతో తమ ఇంటికి వచ్చిన వారికి సమాధానాలు చెప్పుకోలేక ఆ యువతి కుటుంబీకులకు తల ప్రాణం తోక్కొచ్చింది. ఇక చేసేదేమీ లేక చివరకు పోలీసులను ఆశ్రయించారు ఆ యువతి కుటుంబీకులు.

ఎవరో తమ కుమార్తెను వేధిస్తున్నారంటూ ఈ నెల 2వ తేదీన సైబర్ క్రైమ్ వారికి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆర్డర్లు వస్తున్న ఫోన్ నెంబర్‌ను ట్రాక్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర నుంచి రెండు సెల్‌ఫోన్లు, ఒక వైఫై రూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. వెంటనే నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి మానసిక ఆరోగ్యం గురించి కౌన్సిలింగ్ ఇప్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read Also: ‘నిర్లక్ష్యం వహిస్తే కఠినంగానే ఉంటా’.. చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘అలాంటి అవకాశం బీజేపీలో సాధ్యం’

ప్రతిపక్షాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా(JP Nadda) తీవ్ర విమర్శలు...

కొత్త ఆధార్ కార్డుల కోసం కొత్త రూల్.. వారిని ఆపడానికే..

ఇకపై రాష్ట్రంలో జారీ చేసే కొత్త ఆధార్ కార్డుల(Aadhaar) విషయంలో కీలక...