ఫస్ట్ ఫ్లోర్ నుండి తలకిందులుగా విద్యార్థికి శిక్ష..ప్రిన్సిపాల్ అరెస్ట్

Student sentenced upside down from first floor..Principal arrested

0
91

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ స్కూల్‌కు చెందిన రెండ‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థికి వేసిన శిక్ష కార‌ణంగా అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. స్కూల్ బిల్డింగ్‌లోని ఫ‌స్ట్ ఫ్లోర్‌లో అల్ల‌రి చేస్తున్న ఓ విద్యార్థిని స్కూల్ ప్రిన్సిపాల్ త‌ల కిందులుగా వేలాడ‌దీశాడు.

ఒక చేతితో విద్యార్థి కాలును ప‌ట్టుకుని ఫ‌స్ట్ ఫ్లోర్ నుంచి కింద‌కు వ‌దిలేసే రీతిలో ఆ స్టూడెంట్‌కు శిక్ష వేశాడు. అయితే ఈ ఘ‌ట‌న‌ శనివారం జరగగా దానికి సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. దీంతో యూపీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఆ ఫోటో ఆధారంగా ప్రిన్సిపాల్‌పై ఫిర్యాదును న‌మోదు చేయాల‌ని మీర్జాపూర్ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశించింది.