Students Arrest: ఆ నలుగురు విద్యార్థులు అరెస్ట్‌

-

Students Arrest in brutally attack on another student at Bhimavaram incident: ఓ విద్యార్థిని గదిలో.. కర్రలతో కొడుతూ దారుణంగా హింసించిన నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. భీమవరంలో నలుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు.. మరో విద్యార్థిని గదిలో పెట్టి కర్రలతో కొట్టిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పోలీసులు.. బాధ్యులైన నలుగురు విద్యార్థిలపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రేమ విషయంలో అంకిత్‌ అనే వ్యక్తిని కొట్టినట్లు పోలీసులు తెలిపారు. పట్టణంలోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ.. ఐదుగురు విద్యార్థులు ఎస్‌ఆర్‌కే ఇంజినీరింగ్‌ కాలేజీలో సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నారు.

- Advertisement -

ప్రేమ వ్యవహారంలో నరసన్నపేటకు చెందిన అంకిత్‌కు‌, ప్రవీణ్‌, ప్రేమ్‌ కుమార్‌, స్వరూప్‌, నీరజ్‌ అనే నలుగురుకు వాగ్వాదం జరిగింది. దీంతో అంకిత్‌పై.. మిగిలిన నలుగురు గదిలో విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. దాడిలో తీవ్ర గాయాలపాలయ్యాయి. భీమవరం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించిన బాధితుడు.. నలుగురు విద్యార్థులపై ఫిర్యాదు చేశాడు. దాడికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారటంతో, ఆ నలుగురు విద్యార్థులను ప్రిన్సిపల్‌ సస్పెండ్‌ చేయగా.. తాజాగా పోలీసులు వారిని అరెస్టు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...