ఏపీ: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో దారుణం చోటు చేసుకుంది. లైంగిక వేధింపుల ఘటనలో ఏలూరు సబ్ రిజిష్టార్ జయరాజుపై కేసు నమోదు నమోదైంది. రిజిస్టార్ ఆఫీస్ లోని ఆడిట్ సెక్షన్ లో అటెండర్ గా పని చేస్తున్న ఓ వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు సబ్ రిజిష్టార్ జయరాజు. గత కొద్ది రోజులుగా తన కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధించారు జయ రాజు.
జయరాజు గతకొద్ది రోజులుగా తన కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధిస్తున్నాడంటూ దిశా పోలీసులను ఆశ్రయించింది. జయరాజు వేధింపుల గురించి సదరు మహిళా ఉద్యోగిని జిల్లా రిజిస్టార్ కి తెలపగా అధికారులు మందలించారు.
అయినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోగా తన కోరిక తీర్చకపోతే ప్రాణహాని తలపెడతానని బెదిరింపులకి పాల్పడ్డాడు జయరాజు. అధికారుల సూచనల మేరకు దిశా పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.