బైక్ పై ఏకంగా నలుగురు – అక్కడ బండి దగ్గరకు పాము ఎంట్రీ – ఈ వీడియో చూడండి

ఓ పాము వారు ప్రయాణిస్తున్న బైక్లోకి దూరింది

0
124

కొంత మంది ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పినా అస్సలు పట్టించుకోరు. వారికి జరిమానాలు విధించినా మార్పు రాదు. అందుకే ఇప్పుడు ఇలాంటి వారి వాహనాలు కూడా పోలీసులు తీసుకుంటున్నారు. వారికి లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. ద్విచక్ర వాహనం పై కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని, ఇద్దరూ హెల్మెట్స్ ధరించాలని పోలీసులు ఎన్నో సార్లు చెబుతున్నారు.

ఇక మహానగరాల్లో కచ్చితంగా దీనిని పాటిస్తున్నారు. అయితే బైక్ పై ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఏకంగా నలుగురు ప్రయాణం చేశారు. ఇక అక్కడ పోలీసులు లేరు కాని వారి బైక్ దగ్గరకు సడెన్ గా పాము వచ్చింది. దీంతో ఒక్కసారిగా బైక్ కి బ్రేకులు పడ్డాయి. వెంటనే నలుగురు కింద పడ్డారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడ పంటపొలాల్లో నుంచి ఓ పాము వారు ప్రయాణిస్తున్న బైక్లోకి దూరింది. మొత్తానికి దీనికి చాలా మంది ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

వీడియో ఇదే ….

https://www.instagram.com/p/CQxcceSJW3o/