ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య

0
87

ఏపీలో విషాదం నెలకొంది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని లెప్రసీ కాలనీలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఓ షాపింగ్ మాల్ లో సూపర్ వైజర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మృతుడిని ఎస్ ఉదయ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. మద్యానికి బానిసై ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు వెల్లడించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అలిపిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.