వివాహేతర సంబంధ అనుమానం..స్నేహితుడిని దారుణంగా పొడిచి చంపిన జంట‌

0
117

ప్రస్తుతం కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా చాలామంది కాపురాలు కూలిపోతున్నాయి. దేశంలో ఇప్పటికే అక్రమ సంబంధాల కారణంగా ఎంతో మంది హత్యలు, ఆత్మహత్యలు చోటుచేసుకోగా..తాజాగా మద్యప్రదేశ్ లో వివాహేతర సంబంధం కారణంగా నిండు ప్రాణం బలయిపోయింది.

త‌న ప్రియురాలితో ఓ యువకుడు వివాహేత‌ర సంబంధం క‌లిగి ఉన్నాడ‌నే అనుమానంతో  బ‌బ్లూ అనే కామాంధుడు అతని ప్రాణస్నేహితుడిని ప్రియురాలి ముందే దారుణంగా క‌త్తితో పొడిచి చంపి ఆపై పుర్రెను ఇంట్లోనే దాచిన ఘటన స్థానికులను భయభ్రాంతులను చేసింది. క‌త్తితో పొడిచి చంపిన అనంతరం వారిద్ద‌రూ ఇంటిలో గుంట త‌వ్వి మృత‌దేహాన్ని పాతిపెట్టారు.

ఈ ఘటన బ‌బ్లూ తాగిన మైకంలో మే 23న పుర్రెను పట్టుకొని తిరుగుతూ స్ధానికుల‌ను బెదిరించడంతో ఆలస్యంగా వెలుగుచూసింది. దాదాపు 12 గంట‌ల పాటు నిందితుడు చెప్పిన స్ధ‌లంలో త‌వ్వి మృత‌దేహాన్ని పోలీసులుబయటకుతీసారు. పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత నిందితుడు బ‌బ్లూ అత‌డి ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల కోసం ఆ జంటను పోలీసులు విచారిస్తున్నారు.