24 గంటల్లో 20 మంది అనుమానాస్పద మృతి..అదే కారణమా?

Suspicious death of 20 people in 24 hours..is that the same reason?

0
89

బిహార్​లో అనుమానాస్పద మరణాలు ఒక్కసారిగా కలకలం రేపాయి. గోపాల్​గంజ్​ జిల్లాలోని కుషాహర్, మహ్మద్‌పుర్​ గ్రామాల్లో బుధవారం..12 మంది చనిపోగా ఆ సంఖ్య గురువారం నాటికి 13కు చేరింది. అయితే తాజాగా పశ్చిమ చంపారన్​ జిల్లా, బెతియా పట్టణంలోని తెల్హువా గ్రామంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

దీంతో ఒక్క రోజు వ్యవధిలోనే 20 మంది మరణించారు. అయితే కల్తీ మద్యం సేవించడం వల్లే వీరంతా మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు అధికారులు. ఆనందంగా దీపావళి జరుపుకోవాల్సిన ఆయా ప్రాంతాల ప్రజలు..అకస్మాత్తు మరణాలతో శోకసంద్రంలో మునిగిపోయారు.