Tirupati: వృద్ధురాలి అనుమానాస్పద మృతి..హత్యా? ఆత్మహత్యా?

0
95

తిరుపతి భవాని నగర్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద వృద్ధురాలు అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే వృద్ధురాలి మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆమెది హత్యా? ఆత్మహత్యా? అనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భవాని నగర్ లో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రామప్ప భార్య రాజేశ్వరి నివాసం ఉంటుంది. ఆమె మృతదేహాన్ని దాదాపు 50 అడుగుల దూరం తీసుకెళ్లి కాలువలో పడేసినట్టు రక్తపు మరకలు ఏర్పడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఈస్ట్ పోలీసులు వృద్ధురాలి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.