సాఫ్ట్ వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి..హత్యా?..ఆత్మహత్యా?

0
83

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి ఇప్పుడు కలకలం రేపుతోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి దీప్తిశ్రీనగర్ లో నివాసం ఉంటున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి సందీప్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. నాలుగవ అంతస్థు పై నుండి తన లాప్ టాప్ తో సహా కింద పడి మృతి చెందినట్లు సమాచారం. అయితే ఇది హత్యా? లేక ఆత్మహత్యా? ప్రమాదవశాత్తు జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.