భవిష్యత్తు చెబుతున్న స్వామిజీ – కాని అది ఫుల్ బాటిల్ తాగిన వారికే చెబుతారట

Swamiji foretelling the future of those who drank the full bottle

0
100

మన దేశంలో స్వామిజీలని బాబాలని చాలా మంది నమ్ముతారు. ఇక్కడ తమిళనాడు లో ఎక్కడ నలుగురు మాట్లాడుకున్నా లిక్కర్ స్వామిజీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇదేమిటి లిక్కర్ స్వామిజీ అనే మాట కొత్తగా ఉందా? ఆ స్టోరి వింటే ఇంకా గమ్మత్తుగా ఉంటుంది. తమిళనాడు లోని కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూర్ సమీపం లోని నెమిలి గ్రామంలో ఉన్న స్వామిజి పేరు మణి స్వామిజి.

ఈ స్వామిజీ దగ్గరకు నిత్యం వందల మంది భక్తులు వస్తారు, అయితే భవిష్యత్తు ఎలా ఉంటుంది మేము అనుకున్నవి జరుగుతాయా? ఇలా అనేక ప్రశ్నలు అడుగుతారు. ఈ స్వామిజీ దగ్గరకు పురుష భక్తులు ఎక్కువ మంది వస్తారు. తమ లైఫ్ ఎలా ఉండబోతోంది అని తెలుసుకుంటారు. అయితే ఇక్కడ ఇంత మంది పురుష భక్తులు రావడానికి ఓ కారణం ఉంది.

ఈ మణి స్వామిజి స్పెషల్ ఏంటంటే ఎవరైతే తమ భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారో వారు ఒక ఫుల్ బాటిల్ మద్యం తాగితేనే వారికి ఈయన భవిష్యత్తు చెబుతారట. ఇంతకీ లిక్కర్ తాగితే ఇక ఆ స్వామిజీ చెప్పింది ఆ భక్తులు ఏం వింటారు? ఆ మత్తులోనే ఉంటారు కదా, మరి ఆ భక్తులు ఏం తెలుసుకుంటున్నారో ఏమిటో? అంటున్నారు ఇది విన్న యువత.