ఎవరైనా తెలియని వారి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినా సోషల్ మీడియా అకౌంట్ల నుంచి రిక్వెస్ట్ లు వచ్చినా, తెలియని వారితో వెంటనే ఫ్రెండ్ షిప్ చేయడం చాలా రిస్క్. ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తుంటే చాలా మంది ఇలా వారి మాయలో పడిన వారే ఉంటున్నారు. ఆన్ లైన్ ద్వారా యువకులని లైన్లోకి పెట్టిన యువతి నెమ్మదిగా తన ముగ్గులోకి దింపుతుంది.. న్యూడ్ వీడియో కాల్స్ తో పాటు ఫోటోలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ కి దిగింది. తర్వాత వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తోంది. చివరకు ఓ బాధితుడు పోలీసులకి ఫిర్యాదు చేశాడు
హైదరాబాద్ లోని ఓ యువకుడికి గత నెల 30న తన మొబైల్ వాట్సాప్ కు ఓ నంబర్ నుండి మెసేజ్ వచ్చింది. ఆ నెంబర్ అమ్మాయిది సరదాగా ఛాటింగ్ చేశాడు పరిచయం పెరిగింది. ఇక ఆమెతో మాట్లాడి ఆమె మాయలో పడ్డాడు. ఆమె అడిగిన వెంటనే ఫేస్ బుక్ ఐడిని షేర్ చేశాడు. వారి మధ్య సాగుతున్న ఆన్లైన్ చాటింగ్ ఫోటోలు, న్యూడ్ వీడియో కాల్స్ వరకు వెళ్లాయి.
ఆమె అవన్నీ రికార్డ్ చేసింది. తర్వాత ఆ యువకుడ్ని బెదిరించింది. డబ్బులు ఇవ్వకపోతే మీ స్నేహితులకి ఇవన్నీ పంపిస్తా అని వార్నింగ్ ఇచ్చింది. ఇక పలుసార్లు అతను ఫోన్ పే ద్వారా డబ్బులు పంపాడు. ఇంకా డబ్బులు అడగడంతో చివరకు పోలీసులని ఆశ్రయించాడు.