విషాదం..ఏపీలో టీచర్ ఆత్మహత్య

0
112

ఏపీ: సత్యసాయి జిల్లాలో టీచర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో పడి హరినాథ్ అనే ఉపాద్యాయుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో శవాన్ని బయటకు తీశారు. కాగా ఉపాధ్యాయుని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.