ఈ దారుణమైన ఘటన వింటే కన్నీరే వస్తుంది -పెళ్లిచేసుకునేవారు ఇది తెలుసుకోండి

Tears come when you hear about this terrible event-Get to know the bridesmaids

0
77

వివాహం అయ్యాక ఎవరైనా మారతారు భార్యే లోకంగా ఉంటారు. పెళ్లికి ముందు వారు ఎలా ఉన్నా పెళ్లి తర్వాత అవన్నీ పక్కన పెట్టి కొత్త జీవితం స్టార్ట్ చేస్తారు. అయితే ఓ యువకుడు ఇలా భార్యతో సరదాగా ఉండటం పక్కన ఉన్న ఫ్యామిలీ భరించలేకపోయింది. ఇన్నాళ్లు తమతో క్లోజ్ గా ఉన్న యువకుడు తమను పట్టించుకోవడం మానేశాడు అంటూ కోపంతో రగిలిపోయారు.

ఆర్థికంగా సాయం లేదు, మనల్ని పెద్దగా పట్టించుకోవడం లేదని కోపంతో పగ పెంచుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం. యూపీలో సంజిత్, రింకు దంపతులుంటున్నారు. ఆటో డ్రైవర్ అయిన సంజిత్ జులాయిగా తిరిగి అప్పులపాలయ్యాడు. ఈ సమయంలో పక్కన అద్దెకు ఉంటున్న రాజేశ్ రింకుతో అఫైర్ పెట్టుకున్నాడు. ఇంట్లో కావాల్సిన వస్తువులు అన్నీ ఇచ్చేవాడు. ఇలా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని సంజిత్ కు తెలిసినా అన్నీ కొని ఇస్తున్నాడు అని ఈ మొగుడు సైలెంట్ గా ఉన్నాడు.

ఈ ఏడాది ఏప్రిల్లో రాజేశ్ వివాహం చేసుకున్నాడు. జార్ఖండ్కు చెందిన పూజ అనే యువతిని పెళ్లి చేసుకొని ఇదే ఇంటికి తీసుకొచ్చాడు. ఇక రింకూతో అఫైర్ కు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఆమెకి డబ్బులు ఇవ్వడం మానేశాడు. వారితో మాట్లాడకుండా ఉండేవాడు. ఇవన్నీ ఆ జంటకి నచ్చలేదు చివరకు పూజ వల్లే ఇలా మారాడు అని ఆమెని చంపాలి అని ప్లాన్ వేశారు. రాజేష్ డ్యూటికి వెళ్లిన సమయంలో ఆమెకి దిండు పెట్టి ఊపిరిఆడకుండా చంపేశారు. ఇక పోలీసుల ముందు ఏం చెప్పారంటే పూజ ప్రియుడు మరో వ్యక్తి వచ్చి ఆమెతో గొడవ పడ్డారు. ఆమెని చంపేశారు అని తెలిపారు. పోలీసులు అనుమానంతో సీసీ కెమెరాలు పరిశీలించారు. దీంతో రెండు రోజుల్లో అసలు నిందితులు వీళ్లేనని తేల్చారు.